నాగార్జున సాగర్ డ్యాంపై ఉద్రిక్తత

Nov 30,2023 07:24 #AP vs TS, #Dispute, #Nagarjuna Sagar
tension in nagarjuna sagar

– డ్యాంపైకి ప్రవేశించిన ఏపీ పోలీసులు
– 13వ గేటు వద్ద కంచె ఏర్పాటు

ప్రజాశక్తి-నాగార్జున సాగర్ : నాగార్జున సాగర్ డ్యాంపై బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీకి చెందిన పోలీసులు నాగార్జున సాగర్ డ్యాంకి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్‌, తెలంగాణ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఏపీ పోలీసులకు డ్యాం భద్రతా బలగాలకు, తెలంగాణ పోలీసులు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కుడి కాల్వ నుంచి నీటిని తరలించేందుకు యత్నం చేశారు. 13వ గేటు వద్ద ఏపీ పోలీసులు ముళ్ల కంచె ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు ఏపీతో కలిసి కేసీఆర్ ప్లాన్ చేశారంటూ ఆరోపణలు వెలువడుతున్నాయి.

➡️