అక్రమార్కులపె ౖచర్యలు తీసుకోవాలి

Jun 28,2024 19:57
అక్రమార్కులపె ౖచర్యలు తీసుకోవాలి

మాట్లాడుతున్న సిపిఐ నాయకులుఅక్రమార్కులపె ౖచర్యలు తీసుకోవాలి..ప్రజాశక్తి నెల్లూరు సిటీ:అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమి పట్టాలను కొల్ల కొట్టారని.. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఐ నగర సమితి నాయకులు వాటంబేటీ నాగేంద్ర పేర్కొన్నారు. నెల్లూరు సిపిఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఇరగాలమ్మ సంఘం వద్ద ఉన్న ప్రభుత్వ భూమి 85 సెంట్లను గత ప్రభుత్వంలో అధికారుల అండదండలతో ఎక్కడికక్కడ కబ్జాకు గురవడం బాధకరమన్నారు. అధికారం ఉందనే ధీమాతో ఫోర్జరీ సంతకాలతో ఫోర్జరీ పట్టాలతో ప్రభుత్వ భూములు లేఅవుట్లు వేసుకుని విచ్చలవిడిగా ఆక్రమణలు చేశారన్నారు.ఈ విషయం తెలిసి కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనక అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి పట్టాలు పొందిన విషయం అధికారులకు తెలిసి కూడా వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. ఆ పట్టాలను రద్దు చేయకపోవడం, ప్రభుత్వ భూమికి కార్పొరేషన్‌ అధికారులు వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌ కట్టించుకుని దాని ప్రాతిపదికగా పట్టాలు రిజిస్టర్‌ చేసుకోవడం దౌర్భాగ్యమైన విషయమన్నారు. నిశితంగా పరిశీలించకుండా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు వారికి పట్టాలు మంజూరు చేయడం వెనక అధికారుల పాత్ర కూడా ఉందనేది తేటతెల్లమైందన్నారు. గచ్చు కాలువ బాధితులకు ఇచ్చిన స్థలాల పట్టాలను బాధితులు తిరిగి వారికి ఇచ్చి వేయడం జరిగిందన్నారు. వైసీపీ కార్పొరేటర్లు, ప్రధాన నాయకుల అండదండలతో, కార్పొరేషన్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డారన్నారు.కార్పొరేషన్‌ అధికారుల పై చట్టపరంగా,శాఖా పరమైన చర్యలు తీసుకోకపోతే సిపిఐ ఉద్యమిస్తుందన్నారు.సమావేశంలో సిపిఐ నగర నాయకులు పి లీలా మోహన్‌, కె.సతీష్‌, లజపతిరారు తదితరులు పాల్గొన్నారు.

➡️