తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Dec 24,2023 17:32 #road accident

నారాయణ పేట : తెలంగాణలోని నారాయణ పేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతులపు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక, మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

➡️