సీఎం పర్యటన.. పచ్చని చెట్లు నరికి వేత

  • చెట్ల నరికి వేతను అడ్డుకున్న స్థానికులు
  • వెనుతిరిగిన సచివాలయ సిబ్బంది

ప్రజాశక్తి -కనిగిరి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిగిరిలో ఆదివారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర రోడ్ షో జరుగుతున్న నేపథ్యంలో సచివాలయ సిబ్బంది రోడ్లకు ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లను తొలగించారు. కనిగిరి శంకవరం, ఆర్టీసీ డిపో, జీవు సెంటర్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న నీడనిచ్చే చెట్లను తొలగిస్తుండటంతో స్థానికులు అధికారులతో వాగ్వాదం చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు చెట్లు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా రోడ్లకు ఇరువైపులా నీడని పచ్చని వేప, చింత చెట్లను తొలగించడం ఏంటని సిబ్బందిని నిలదీశారు. కొన్నిచోట్ల సచివాలయ సిబ్బంది స్థానికులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ వస్తే ఏంటి గొప్ప అని.. పచ్చని చెట్లను ఎందుకు నరికేస్తున్నారని ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే సచివాల సిబ్బంది 5 షట్లను నరికి వేశారు మరో 20 చెట్ల కొమ్మలను తొలగించారు .ఎక్కువ మంది చేరి నిలదీయడంతో సిబ్బంది వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఆ చెట్ల కింద ఉంది కూలీ పనులు చేసుకునే వారు నీడ లేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతోపాటుగా జీపు సెంటర్లో ఉండే డ్రైవర్లు ఆచెట్ల కింద సేత దిగడానికి సౌకర్యంగా ఉండేది. రోడ్లకు ఇరువైపులా ఉండే గత 50 ఏళ్లుగా నీడనిచ్చే చెట్లను నరికి వేయడంతో కనిగిరి ప్రజలు వైకాపా నాయకులపై, సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️