శంషాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం రద్దు..

Nov 29,2023 12:43 #shamshabad airport, #SpiceJet

శంషాబాద్: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు రద్దు చేశారు. విమానాన్ని అర్ధంతరంగా రద్దు చేయడంతో 160 మంది ప్రయాణికులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగారు. ఆలస్యంగా స్పందించిన ఎయిర్ లైన్స్ ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మరో విమానంలో పంపించేందుకు ఏర్పాట్లు చేశామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ప్రయాణాన్ని రద్దు చేసుకున్న ప్రయాణికులకు పూర్తి స్థాయిలో టికెట్ డబ్బును వెనక్కి ఇవ్వనున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

➡️