జనసేన గ్లాస్‌ గుర్తుపై పిటిషన్‌ కొట్టివేత

Apr 16,2024 13:15 #for Janasena, #Glass mark
high court on sand mining

ప్రజాశక్తి-అమరావతి : జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్‌ చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేస్తూ తీర్పు చెప్పింది. ఎన్నికల సంఘం నిబంధనలను అమలు చేయలేదంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ (సెక్యులర్‌) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ముందుగా ఎవరు కోరితే వారికి గుర్తింపు లేని పార్టీలకు ఎన్నికల చిహ్నంగా కేటాయింపు ఉంటుందని ఇసి వాదనల తర్వాత పిటిషన్‌ను కొట్టివేస్తూ మంగళవారం హైకోర్టు తీర్పు చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక ఇసి తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

➡️