‘ఈ పాపం ఎవరిది ?’

May 2,2024 14:51 #died, #old man, #Pension, #sunburn

అమరావతి : నిన్నటి నుండి పింఛన్ల కోసం వృద్ధులు పడుతున్న అవస్థలు ఇన్నీఅన్నీ కావు. ఇంటికొచ్చి ఎవ్వరూ పింఛన్లు ఇవ్వడం లేదు.. ముసలివారికి ఎలాంటి సమాచారం లేదు. ఉదయం నుండి బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్న పండుటాకులు ఎండదెబ్బకు అక్కడే నేలరాలిపోతున్నాయి. మధ్యాహ్నమైనప్పటికీ భోజనం కూడా లేక బ్యాంకు వద్దనే లైన్‌లలో నిలబడుతూ పింఛన్‌ డబ్బుల కోసం వృద్ధులు ప్రాణాలతో పోరాడుతున్నారు…! ‘ ఈ పాపం ఎవరిది ‘ ? అంటూ వృద్ధుల మరణాలను చూస్తున్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు) : నేటి ఉదయం నుండి ముసలివారు పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మధ్యాహ్నమైనా భోజనం లేకుండా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, పద్మ సరస్సు గిరిజన కాలనీకి చెందిన గోపాలయ్య (68) మామిడితోటకు కాపలా కాస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. నిన్న పింఛను డబ్బులస్తాయని గ్రామంలో వెళుతుండగా, వడదెబ్బ తగిలి అక్కడే పడిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో గోపాలయ్య ప్రాణాలు కోల్పోయాడంటూ.. కుటుంబీకులు రోదించారు. ‘ ఈ పాపం ఎవరిది ‘ అంటూ … గ్రామస్తులు ఆవేదనతో ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని , వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

బ్యాంకు ఎదుట లైన్‌లో నిలబడి కుప్పకూలిపోయాడు…
లక్కిరెడ్డిపల్లి (అన్నమయ్య జిల్లా) : లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వఅద్ధుడు గురువారం మఅతి చెందారు. పింఛను డబ్బు కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు ఎదుట నిలబడి ఉండగానే వడదెబ్బ తగిలి అకస్మాత్తుగా కిందపడిపోయారు. స్థానికులు గుర్తించి లేపే లోపు మఅతి చెందారు. కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు వచ్చి మఅతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.

➡️