ఆగని రాకాసి అలలు – ఇళ్లల్లోకి దూసుకొచ్చిన కెరటాలు

May 27,2024 14:17 #crashing, #Houses, #Rakasi waves

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ఉప్పాడ సముద్రతీరంలో మూడు రోజులుగా సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్‌ వరకు రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. ఆదివారం నామమాత్రంగా అధికారులు మూసివేసిన బీచ్‌ రోడ్డు సోమవారం తెల్లారేసరికి యధావిధిగా వదిలేయడంతో బీచ్‌ లో ప్రయాణాన్ని ప్రజలు కొనసాగించారు. దీంతో ఉప్పాడ కాకినాడకు ప్రయాణించే ప్రయాణికులపై సముద్రం విరుచుకుపడడంతో పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. సూరాడ పేట, మాయాపట్నంలో గతంలో వేసిన జియో ట్యూబ్‌ గట్టు పూర్తిగా ధ్వంసం కావడంతో సముద్రపు నీరు ఇళ్లలోకి చొచ్చుకు వచ్చింది. తీర ప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకార గృహాలు ఆ రెండు గ్రామాల్లో సుమారుగా 10 ఇండ్లను తాకడంతో ధ్వంసమయ్యాయి. తీర ప్రాంతంలో మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ నివసిస్తూ ఉంటున్నామని, తమను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

➡️