వైఎస్‌ఆర్‌ పాలనకు జగన్‌ పాలనకు తేడా ఉంది : వైఎస్‌ షర్మిల

Jan 26,2024 15:05 #press meet, #ys sharmila

విజయవాడ: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనకు ఏపీ సీఎం జగన్‌ పాలనకు చాలా తేడా ఉందని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. ఏపీసీసీ కార్యాలయంలో ఉమ్మడి కఅష్ణా జిల్లా కార్యకర్తలతో నిర్వహించిన విస్త్రుత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు.”వైఎస్‌ఆర్‌ పాలనకు జగన్‌ పాలనకు భూమికి.. ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. జలయజ్ఞంపై వైఎస్‌ఆర్‌ ఎంతో దఅష్టి పెట్టారు. ఆయన 17 శాతం నిధులిస్తే.. జగన్‌ 2.5 శాతమే ఖర్చు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. రాజధాని, ప్రత్యేక హోదా లేదు.. ఉన్నవన్నీ అప్పులే. ఒక్క సీటూ లేని బిజెపి రాష్ట్రాన్ని శాసిస్తోంది. ఆ పార్టీకి వైసిపి నేతలు కట్టుబానిసలు. స్వలాభం కోసం రాష్ట్రాన్నే తాకట్టు పెట్టారు. 25 మంది ఎంపీలున్నా తెచ్చింది గుండు సున్నా. పులి కడుపున పులే పుడుతుంది.. నాది వైఎస్‌ఆర్‌ రక్తం. ఎవరు అవునన్నా.. కాదన్నా నేను వైఎస్‌ షర్మిలారెడ్డినే” అని ఆమె వ్యాఖ్యానించారు.

➡️