జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు ఇవే..!

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. జనవరి 1న శ్రీవారి ఆలయంలో పెద్దశాత్తుమొర, వైకుంఠద్వార దర్శనం ముగింపు, 5న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ముగింపు, 6న తిరుమల శ్రీవారు తిరుమలనంబి సన్నిధికి వేంచేపు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.జనవరి 7న సర్వ ఏకాదశి, 9న తొండరడిప్పొడియాళ్వార్‌ వర్షతిరునక్షత్రం, 14న భోగిపండుగ ,ధనుర్మాసం ముగింపు, 15న మకరసంక్రాంతి. సుప్రభాత సేవ పున్ణప్రారంభం, 16న తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు, కనుమ పండుగను వైభవంగా జరుపనున్నట్లు వివరించారు. జనవరి 25న శ్రీరామకఅష్ణతీర్థ ముక్కోటి, 28న తిరుమొళిశైయాళ్వార్‌ వర్షతిరునక్షత్రం, 31న కూరత్తాళ్వార్‌ వర్షతిరునక్షత్రం కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

➡️