ఈసారి బీసీ లేదా మైనారిటీలకు విజయవాడ పశ్చిమ సీటు : కేశినేని

Jan 1,2024 18:45 #kesineni
  • నేను గానీ, నా కుటుంబ సభ్యులు గానీ పోటీ చేయం

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు బీసీ లేదా మైనారిటీలదని అన్నారు. తాను విజయవాడ పార్లమెంటు స్థానానికి కాపలా కుక్కలాంటివాడ్నని.. తాను టీడీపీలో లేకుండా ఉంటే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని జగ్గయ్యపేట నుంచి దోచుకోవచ్చనేది కొందరి ఆలోచన అని కేశినేని నాని వ్యాఖ్యానించారు.

➡️