హుజూరాబాద్‌లో విషాదం.. టిప్పర్‌ బోల్తాపడి ముగ్గురు మృతి

Apr 6,2024 10:33 #3 death, #karimnagar, #road acident

కరీంనగర్‌: హుజూరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. టిప్పర్‌ బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన హుజూరాబాద్‌లోని బోర్నపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్‌ మండలం ఎలబోతారం గ్రామం నుంచి హుజూరాబాద్‌కు మట్టితో ట్రక్కు బయలుదేరింది. ఈ క్రమంలో బోర్నపల్లి మూలమలుపు వద్ద డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో ట్రక్కు అదుపుతప్పింది. అదే సమయంలో బైక్‌పై వస్తున్న ముగ్గురు యువతీయువకులపై మట్టి పడింది. దీంతో వెంటనే వారిని హుజూరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విజయ్, సింధుజ ఇద్దరు మృతిచెందారు. వర్ష అనే యువతి చికిత్స పొందుతూ చనిపోయింది. మృతులు బోర్నపల్లికి చెందిన వారే.  మృతదేహాలను హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

➡️