పటాన్‌చెరులో వాల్యూజోన్‌ మార్ట్‌

Dec 16,2023 08:22 #mart, #opened

– ప్రారంభించిన సినీ నటుడు బాలకృష్ణ

ప్రజాశక్తి-హైదరాబాద్‌ వ్యాల్యూజోన్‌ రిటైల్‌ వాణిజ్య వ్యవస్థలోనే ఒక వినూత్న విప్లవాన్ని తీసుకురానుందని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌ నగరంలోని పటాన్‌చెరులో ఏర్పాటు చేసిన నూతన వాల్యూజోన్‌ హైపర్‌ మార్ట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఆ సంస్థకు బాలకృష్ణ బ్రాండ్‌ అంబాసీడర్‌గా వ్యవహారిస్తున్నారు. దీనికి పి వెంకటేశ్వర్లు, ఎస్‌ రాజమౌళి, టి ప్రసాదరావులు ప్రధాన మెంటర్లుగా ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. వ్యాల్యూజోన్‌ హైదరాబాద్‌ నగరానికే గర్వకారణమన్నారు. ఇందులో విస్తృత శ్రేణీకి చెందిన నాణ్యమైన ఉత్పత్తులను లాభసాటి ధరలకు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. గొప్ప షాపింగ్‌ అనుభవాన్ని అందిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వాల్యూజోన్‌ డైరెక్టర్లు సురేష్‌ సీర్ణ, పివిఎస్‌ అభినవ్‌, టి రాకేష్‌, కేశవ్‌ గుప్తా మాట్లాడుతూ.. వినూత్న షాపింగ్‌కు తమ సంస్థ చిరునామాగా నిలువనుందన్నారు. తమ మాల్‌లోని అసంఖ్యాకమైన బ్రాండ్లపై 40 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపారు. విభిన్నమైన ఆఫర్లు అందుబాటులో ఉంటాయన్నారు. అందుబాటు ధరల్లో వినియోగదారులు మరిన్ని వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రోత్సహించేలా వాతావరణం ఉంటుందని తెలిపారు.

➡️