గాయని సాహితీ కి వేటూరి పురస్కారం ప్రధానం

Jan 31,2024 10:40 #Awards, #Literature
veturi award to sahiti

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : వర్ధమాన సినీ నేపధ్య గాయని సాహితి కి వేటూరి యువ గాయని పురస్కారం ప్రధానం చేయడం అభినందనీయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సినీ గేయ రచయిత వేటూరి సుందర రామ్మూర్తి 98వ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం డాబాగార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆత్రేయ స్మారక కళా పీఠం అద్వర్యంలో ఎదలో మోహన లాహిరి శీర్షికన సినీ సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు పదాని జానపదం, వేణువై వచ్చాను భవనానికి, రాలిపోయే పువ్వా నీకు వర్ణాలెందుకే వంటి గీతాలతో తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన వేటూరి పేరిట పురస్కారం సాహితికి ఎంపిక చేయడం హర్షనీయమన్నారు. అనంతరం శంబర జోగారావు సారథ్యంలో జరిగిన సంగీత విభావరిలో సాహితి, రమేష్ పట్నాయక్ పాడిన వేదం ఆణువణువననాదం, జోగారావు, హారిక పాడిన శ్రీలక్ష్మి పెళ్ళికి, బాల గణేష్, లీపీక పాడిన కిన్నెరసాని సాని వచ్చిందమ్మా తదితర వేటూరి గీతాలు ఆలపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ప్రధాన కార్యదర్శి గంటి మురళి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు, విజయ నగరం కాబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు అవనాపు విజయ్, పైడా కృష్ణ ప్రసాద్, పీఠం అధ్యక్షులు ఉసిరికాల చంద్ర శేఖర్, సుహాసినీ ఆనంద్, దాడి సత్యనారాయణ, కళా సంస్థల అదినేతలు చెన్నా తిరుమలరావు, ఎస్ఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️