కేశినేని నానికి విజయవాడ

Jan 12,2024 09:33 #Keshineni Nani, #Vijayawada
  • వైసిపి మూడో విడత జాబితా విడుదల
  • ఆరు ఎంపి, 15 మంది ఎమ్యెల్యే అభ్యర్థుల ఖరారు
  • మల్లాది విష్ణుకు మొండిచేయి
  • పెనమలూరుకు జోగి రమేష్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సుదీర్ఘ చర్చల అనంతరం వైసిపి మూడో జాబితాను గురువారం ప్రకటించింది. దీనిలో ఆరుగురు ఎంపి అభ్యర్థులతోపాటు 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఉన్నారు. బుధవారం వైసిపిలో చేరిన విజయవాడ ఎంపి కేశినేని నానికి విజయవాడ లోక్‌సభ స్థానంతోపాటు, ఆయన అనుచరుడు స్వామిదాస్‌కు తిరువూరు టికెట్లు ఖరారు చేశారు. ఇప్పటి వరకూ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగిన విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఈ లిస్టులోనూ మొండిచేయి చూపించారు. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీకి విశాఖపట్నం పార్లమెంటు స్థానం ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన గరుమూర్తికి సత్యవేడు అసెంబ్లీ సీటు కేటాయించారు. శ్రీకాకుళం జడ్పి ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఉప్పాడ నారాయణమ్మను ప్రకటించారు. ఇప్పటి వరకూ 59 అసెంబ్లీ నియోజవకర్గాలకు ఇన్‌ఛార్జులను ప్రకటించారు.

➡️