ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన

Jan 4,2024 11:43 #MGNREGS, #Protest
village field assistants protest

ప్రజాశక్తి-కుంచనపల్లి : కనీస  వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చేపట్టారు. ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర యూనియన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారి దగ్గర వేలమంది ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నాకు దిగారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతన చట్టం ప్రకారం 26 వేలు వేతనంగా ఇవ్వాలని, ఏఫ్టిఈ కల్పించాలని, టార్గెట్ల విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో యూనియన్ నాయకులు కమిషనర్ తో చర్చలకు వెళ్లారు.

➡️