విశాఖను విషాదనగరంగా మార్చేశారు : లోకేశ్‌

Feb 19,2024 12:17 #Nara Lokesh, #shankaravam, #Visakha

విశాఖ : విశాఖను విషాదనగరంగా మార్చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. సోమవారం విశాఖ నగరంలో జరిగిన ‘శంఖారావం’ సభలో లోకేశ్‌ మాట్లాడుతూ … వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రశాంత వాతావరణం ఉన్న విశాఖను విషాదనగరంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రమే జగన్‌ అని మండిపడ్డారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని మండిపడ్డారు. సంపూర్ణ మద్య నిషేధం అన్నారనీ.. కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని అన్నారు. ఫ్యాన్‌ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రెండు నెలలు ఓపిక పడితే… టిడిపి-జనసేన ప్రభుత్వం వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి అనేదే లేకుండా చేసే బాధ్యత తమదని లోకేశ్‌ అన్నారు.

➡️