సాంకేతిక లోపంతో నిచిపోయిన విశాఖ వందే భారత్‌

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం – సికింద్రాబాద్‌ (20833) వందే భరత్‌ రైల్‌ సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది శుక్రవారం ఉదయం 5:40 గంటలకు సికింద్రాబాద్‌ బయలుదేరాల్సిన ఈ రైల్‌ లో 8 ఏసీ కోచ్‌ లలో సాంకేతిక లోపం తలెత్తి మొరాయించడంతో, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలోని వాల్టెయిర్‌ డివిజన్‌ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ కు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ప్రత్యేక రైలు విశాఖపట్నం – సికింద్రాబాద్‌ (01833)ను ఏర్పాటు చేసింది. 13-3 ఏసి , 2-2 ఏసీ , 02- స్లీపర్‌ క్లాస్‌, వన్‌ జనరేటర్‌ పవర్‌ కార్‌ కోచ్‌లను కలిగి ఈ ప్రత్యామ్నాయ రైలు ఉదయం 7:40 గంటలకు (2 గంటలు ఆలస్యంగా) విశాఖపట్నం నుండి బయలుదేరింది. వాల్తేర్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సౌరభ్‌ ప్రసాద్‌తో పాటు ఎడిఅర్‌ఎం (ఆపరేషన్స్‌) మనోజ్‌ కుమార్‌ సాహూ సీనియర్‌ అధికారులు స్టేషన్‌లోని ఏర్పాట్లను వ్యక్తిగతంగా పర్యవేక్షించి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.

➡️