స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించే వారికే ఓటు

  •  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు తోడ్పడేవారికే ఈ ఎన్నికల్లో కార్మికులు ఓట్లు వేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 1173వ రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ ఎఫ్‌ఎండి, ఆర్‌ఎస్‌ అండ్‌ ఆర్‌ఎస్‌, ప్లాంట్‌ డిజైన్‌ విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయివేటుపరం చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. కార్మికుల పక్షాన నిలవకుండా వైసిపి, టిడిపిలు మోడీ సర్కారుకు వత్తాసు పలకడం దారుణమన్నారు. ఈ సారి స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయంగా పనిచేసే వారికే ఓటు వేయనున్నట్టు తెలిపారు. బిజెపికి మద్దతు పలుకుతున్న పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

➡️