మార్చిలోపు బకాయిలు చెల్లిస్తాం : బొత్స సత్యనారాయణ

Feb 23,2024 16:47 #bosta satyanarayana

విజయవాడ : జెఎసి (జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌) ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. ఈ చర్చల అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ‘మార్చిలోపు బకాయిలు చెల్లిస్తాం. పిఆర్‌సి ఆలస్యమైతే.. ఐఆర్‌ కోసం ఆలోచిస్తాం. ఛలో విజయవాడను విరమించుకోమని ఉద్యోగ సంఘాల్ని కోరాం’ అని ఆయన అన్నారు. కాగా, పిఆర్‌సి బకాయిలు, పెండింగ్‌ డిఎలు చెల్లించాలనే డిమాండ్లపై ఈ నెల 27న ఉద్యోగ సంఘాలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స చర్చలు జరిపారు.

➡️