జగన్‌ సిద్ధం చేసిన డబ్బుల డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారు ? : లోకేశ్‌

అమరావతి : జగన్‌ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారంటూ … బుధవారం ఉదయం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఎక్స్‌ లో పోస్టు చేశారు. జగన్‌ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఎన్నికల్లో వైసిపి ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేణిగుంటలోని గోదాంలో రాష్ట్రవ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉంచిన 52 రకాల వస్తువుల డంప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. టిడిపి ఫిర్యాదు చేయడంతో వైసిపి తాయిలాల డంప్‌ను పట్టుకున్నారనీ.. మరి ఇసుక, లిక్కర్‌లలో జగన్‌ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారు ? అని లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

➡️