అప్రోచ్‌ రోడ్డు లేకుండానే వంతెన ప్రారంభమా?

ఎమ్మెల్యే ఫాల్గుణను నిలదీసిన సిపిఎం సర్పంచ్‌ సునీత
ప్రజాశక్తి-డుంబ్రిగుడ : అప్రోచ్‌ రోడ్డు నిర్మించకుండా వంతెనను ప్రారంభించడం వల్ల ప్రయోజనమేంటని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణను సిపిఎం సర్పంచ్‌ సునీత నిలదీశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం గసభ పంచాయతీ పరిధిలోని లోగిలిలో రూ.1.80 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన వంతెనను ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం సర్పంచ్‌ సునీత మాట్లాడుతూ అప్రోచ్‌ రోడ్డు లేకుండా అసంపూర్తిగా వంతెనను ప్రారంభించడం వల్ల వర్షాలు కురిస్తే రోడ్డు పాడయ్యే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే ఇరువైపులా కనెక్టవిటీ రోడ్లు నిర్మించాలని కోరారు.. మండలంలో ప్రారంభించిన పలు పాఠశాల, అంగన్వాడి భవనాలు అసంపూర్తిగా ఉన్నాయని ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ, లోగిలి వంతెనకు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి రూ 40 లక్షలు మంజూరు చేశామని, మరో నెల రోజుల్లో వాటిని పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపిపి ఈశ్వరి ,జెడ్పిటిసి జానకమ్మ ,వైస్‌ ఎంపిపిలు ఆనందరావు, లలిత మండల అధ్యక్షుడు మల్లేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జిల్లా డైరెక్టర్‌ ఎం శ్రీరాములు, వైసిపి సీనియర్‌ నాయకులు సింహాచలం, కష్ణారావు, మాజీ మండల అధ్యక్షుడు గోపాల్‌ పాల్గొన్నారు.

 

➡️