మళ్లీ గెలిపించండి

May 9,2024 14:49 #cm
  • ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి
    ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌
    ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి జిల్లా సమస్యల పట్ల ఏమాత్ర ప్రస్తావన లేకుండా జిల్లా అభివృద్ధిపై మౌనరాగాన్ని ఆలపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు నగరంలోని ఎస్బిఐ సర్కిల్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు ఆయన హెలికాప్టర్‌ ద్వారా 11 గంటలకు ఎస్టీ బీసీ కాలేజ్‌ గ్రౌండ్‌ కు చేరుకున్నారు. అక్కడి నుంచి స్థానిక నాయకులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు 11:30 గంటలకు బహిరంగ సభలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమం కార్యక్రమాలపై ప్రత్యేకంగా ఒక్కనించారు. కాగా జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ గుండ్రేవుల, వేదవతి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణాల గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు. ముఖ్యంగా మూడు రాజధానుల ఏర్పాటు అంశంలో భాగంగా న్యాయ రాజధాని గురించి ప్రస్తావించకపోవటం గమనార్హం. కర్నూలు నగరంలో ప్రత్యేకించి తాగునీటి సమస్య పరిష్కారానికి సంబంధించి ఎలాంటి హామీ ప్రజలకు ఇవ్వలేదు. అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఏమాత్రం ఆయన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం జిల్లా అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి ఏవైనా ప్రకటన చేస్తారా? అన్న ఆసక్తితో ఉన్న ప్రజలకు ఆ విషయంలో ఎలాంటి హామీ ఒక పోవడం స్థానిక ప్రజలను నిరుత్సాహ పరిచింది. ముస్లిం మైనార్టీలకు రాష్ట్రంలో పెద్దపీట వేశామని నాలుగు శాతం రిజర్వేషన్ల విషయంలో వారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. రాజకీయ రంగంలోనూ నాలుగు శాతం రిజర్వేషన్లను కేవలం విద్య రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం రూ 31 లక్షల 70 వేల కోట్లు 59 నెలల్లో ప్రజల ఖాతాలకు చేరవేశామని ఇది చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తాము చేశామని చెప్పారు. ముస్లింలకు నష్టం కలిగించే సిఏఏ, ఎన్‌ఆర్సి, యుసిసి వంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో బలపరచమని, ముస్లింలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. అభివృద్ధి జరగాలంటే ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్లు నొక్కాలని కోరారు. స్థానికంగా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజ్‌ ఉన్నత చదువులు చదివి ఐఏఎస్‌ అధికారిగా తన పదవిని స్వచ్ఛందంగా వదులుకొని ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అవినీతి మరకలు లేని ఇంతియాజ్‌ను ఓటేసి గెలిపించాలని కోరారు. పేద ప్రజలను సైతం ఢిల్లీకి పంపే పార్టీ వైసిపి అన్నారు. పేద వర్గాల నుంచి వచ్చిన బీసీ నాయకుడు బి వై రామయ్య అని అన్నారు. ఎంపీగా ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తనను రాజకీయాల్లోకి ఆహ్వానించారని, జగన్‌ చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని చూసి వైసిపిలోకి చేరానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజల మనిషి అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది ప్రజల జీవితాల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపారన్నారు. మహిళల లో ఆర్థిక స్వావలంబన పెంపొందించారన్నారు. విద్యతోనే సమాజం మారుతుందని విశ్వసించి జగన్మోహన్‌ రెడ్డి విద్యారంగానికి వైద్య రంగానికి పెద్ద పీటవేశారన్నారు. అందులో భాగంగా అమ్మబడి, విద్యా కానుక, గోరుముద్ద, విద్యా దీవెన వసతి దీవెన, విదేశీ విద్య అంటే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. మహిళలకు చేయూత, భరోసా వంటి అనేక సంక్షేమ పథకాలను చేపట్టారన్నారు. లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ప్రభుత్వాన్ని ఇంటిగుమ్మం ముందుకు సెక్రటేరియట్‌, వాలంటరీ వ్యవస్థ ద్వారా తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి అని అన్నారు. మరోసారి ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో కర్నూలు అసెంబ్లీ స్థానాన్ని ముఖ్యమంత్రికి గిఫ్టుగా అందజేయాలన్నారు. కర్నూలు పార్లమెంటు వైసిపి అభ్యర్థి బి వై రామయ్య మాట్లాడుతూ కర్నూలు గడ్డ వైసిపికి అడ్డా అని మళ్లీ 2019లో మాదిరిగానే 14 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలను ముఖ్యమంత్రికి గెలిచి గిఫ్ట్‌గా ఇస్తామన్నారు. ఈ ఎన్నికలు నీతికి అవినీతికి, ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. పూలే, అంబేద్కర్‌, గాంధీ ఆశయాల శిల్పం జగన్మోహన్‌ రెడ్డి అని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం పథకాలు సామాజిక న్యాయం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. అబద్దాలతో కాలం వెళ్లదీసే పార్టీ టిడిపి అని విమర్శించారు. ఎమ్మెల్యే ఎంఏ ఆఫీస్‌ ఖాన్‌ మాట్లాడుతూ ఇంతియాజ్‌ భాష మంచి మనిషి అని అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత నగర ప్రజలపై ఉందన్నారు. బి వై రామయ్య నిత్యం స్థానికంగా ప్రజల మధ్య ఉండే వ్యక్తి అని సమస్యలు పరిష్కారం కావాలంటే వైసీపీకి ఓటేయాలన్నారు. టిడిపికి ఓటేస్తే బిజెపికి వేసినట్లేనన్నారు. నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పే బిజెపితో ఉంటూ మరోవైపు ముస్లింలకు న్యాయం చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. చేసిన అభివృద్ధిని చూసి మేలు జరిగి ఉంటేనే తనకు ఓటేయాలని చెప్పే ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి మాత్రమేనని అన్నారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో పేదలను అష్ట కష్టాలపాలు చేసిందన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల అందించిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అన్నారు. రెండు బటన్లను నొక్కి జగనన్న రుణం తీర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో వైసిపి రాయలసీమ కోఆర్డినేటర్‌ పొన్నం రామ సుబ్బారెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్‌ రెడ్డి, కేడీసీసీ చైర్మన్‌ ఎస్‌.వి. విజయ మనోహరి, వైసిపి రాష్ట్ర నాయకులు అహ్మద్‌ అలీ ఖాన్‌, గడ్డం రామకఅష్ణ పలువురు వైసిపి నాయకులు పాల్గన్నారు
➡️