పురుగుల అన్నం, కుళ్లిన కోడిగుడ్లు..

May 26,2024 22:12 #food piosion, #ggh, #hydrabad
  • జిజిహెచ్‌లో రోగులకు పంపిణీ

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : నిజామాబాద్‌ జిల్లాలో కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వైద్యం కోసం జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర ప్రాంతాల వారు వైద్యం చేయించుకునేందుకు వస్తుంటారు. అనారోగ్యానికి గురై ఆరోగ్యంగా వెళ్తుంటారు. అయితే, ఆరోగ్య శ్రీ కింద రోగులకు అందజేస్తున్న భోజనంలో పురుగుల అన్నం, కుళ్లిన కోడిగుడ్లు వస్తున్నట్టు పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. చికిత్స పొందుతున్న రోగులకు పౌష్టికాహారం అందించాల్సి ఉన్నా.. అందుకు విరుద్ధంగా అందజేస్తున్నారని రోగుల బంధువులు వాపోతున్నారు. పురుగుల అన్నం, కుళ్లిపోయిన కోడిగుడ్లు వస్తున్నాయని వాటిని ఫోటోలు దించి సోషల్‌ మీడియాలో పెట్టగా.. వైరల్‌గా మారాయి. ఇప్పటికైనా ఇటువంటి పరిస్థితులు రాకుండా జిజిహెచ్‌ యంత్రాంగం సరైన చర్యలు తీసుకొని, చికిత్స పొందుతున్న వారికి సరైన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సోషల్‌ మీడియాలో పలువురు కోరుతున్నారు.

➡️