సచివాలయ ఉద్యోగినిపై వైసిపి నేత లైంగిక దాడి

Dec 5,2023 09:20 #Kadapa, #Sexual Assaults

ప్రజాశక్తి – ఎర్రగుంట్ల (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌ఆర్‌ జిల్లా ఎర్రగుంట్ల పట్టణ పరిధిలో ఉన్న సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగినిపై వైసిపి మండల నాయకుడు సోమవారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన తల్లితో కలిసి బాధితురాలు మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. నిందితుడు రాజేష్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లి డిమాండ్‌ చేస్తున్నారు. మా బావ ఎమ్మెల్యే అంటూ నిందితుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని, నిందితుడి నుంచి తన కుమార్తెకు ప్రాణహాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

➡️