డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మకు ఏ గేమ్‌ అంటే ఇష్టమో తెలుసా..!?

ఇంటర్నెట్‌డెస్క్‌ : ‘హనుమాన్‌’ మూవీ సంక్రాంతికి విడుదలై..భారీ సక్సెస్‌ అందుకుంది. గతంలో ప్రశాంత్‌వర్మ ‘కల్కి,’, ‘జాంబిరెడ్డి’ హిట్‌ చిత్రాల్ని తెరకెక్కించారు. ఆ తర్వాత తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్‌’ ఈ సినిమా కూడా సూపర్‌డూపర్‌ హిట్‌కొట్టింది. దీంతో టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా ప్రశాంత్‌ పేరుతెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత వర్మ గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అదేంటంటే.. ప్రశాంత్‌వర్మకు క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టమట. స్కూల్‌, కాలేజీ డేస్‌లో కూడా ప్రశాంత్‌ క్రికెట్‌ ఆడేవాడట. బ్యాట్స్‌మెన్‌, బౌలర్‌ అయిన ప్రశాంత్‌ జిల్లాస్థాయిలో క్రికెట్‌ ఆడి పలు ట్రోఫీలు గెలుచుకున్నాడట. అలాగే పలు ప్రయివేట్‌ టోర్నమెంట్స్‌లోనూ, సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో కూడా ప్రశాంత్‌ క్రికెట్‌ ఆడాడు. ప్రస్తుతం ప్రశాంత్‌ ‘హనుమాన్‌’ మూవీ తర్వాత హ్యాపీ మూడ్‌లో బ్యాట్‌ పట్టుకుని క్రికెట్‌ను ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

 

➡️