Republic Day: భారత్‌కు రష్యా స్పెషల్‌ విషెస్‌

Jan 27,2024 08:04 #Happy Republic Day, #russia

న్యూఢిల్లీ : భారత్‌ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే రష్యా కూడా భారత్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ‘గదర్‌’ చిత్రంలోని ఓ పాటకు రష్యా ఎంబసీ ఉద్యోగులు, చిన్నారులు, ప్రొఫెషనల్‌ డ్యాన్సర్లందరూ కలిసి డ్యాన్స్‌ చేశారు. అనంతరం ‘హ్యాపీ రిపబ్లిక్‌ డే’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోని న్యూఢిల్లీలోని రష్యా దౌత్య కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసింది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. భారత స్నేహితులకు ఈ అమృత్‌కాల్‌ మరింత ప్రకాశవంతంగా ఉండాలి. రష్యా – భారతీయ దోస్తీ కలకాలం వర్ధిల్లాలి’ అని వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గామారింది.

➡️