తెలంగాణ : యూ ట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ జస్వంత్ గంజాయితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి అరెస్టయ్యాడు. షణ్ముఖ్తోపాటు అతడి అన్న సంపత్ వినయ్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. షణ్ముఖ అన్న సంపత్ వినరు తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ఫ్లాట్‌కు వెళ్లారు. ఇంట్లో సోదాలు చేయగా గంజాయి, డ్రగ్స్ దొరికాయి. దీంతో అన్నదమ్ములిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.