మీరు రోజూ తగినంత నిద్రపోవడం లేదా? అనారోగ్య సమస్యలెన్నో!

Feb 28,2024 18:25 #health, #sleeping

ఇంటర్నెట్‌డెస్క్‌ : మీరు రోజూ తగినంత నిద్రపోవడం లేదా? అయితే అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీరు రోజూ పోషకాహారం తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి వస్తుంది. ఆహారం సరిగ్గా తీసుకోకపోతే కచ్చితంగా మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.

– నిద్ర సరిగ్గా లేకపోతే మధుమేహం, ఊబకాయ సమస్యలకు గురవుతారని వైద్యులు చెబుతున్నారు.

– తగినంత నిద్ర లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

– నిద్ర లేకపోవడం వల్ల.. అధికంగా తింటారు. అందుకే ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే మీరు తగినంత ఆహారం తీసుకోవడంతోపాటు, కంటినిండా నిద్రపోతే అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం తప్పుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

➡️