వేసవిలో పచ్చి మామిడి తింటే.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

Mar 20,2024 13:42 #health

ఇంటర్నెట్‌డెస్క్‌ : వేసవిలో పచ్చి మామిడి విరివిగా దొరుకుతుంది. వీటితో సంవత్సరానికి సరిపడా ఆవకాయని పెట్టుకోవచ్చు. లేదా జ్యూస్‌ల్లో ఉపయోగించడమో, ఇతర స్పెషల్‌ డిషెస్‌ తయారుచేయడమో చేస్తుంటారు. అలాగే పచ్చిమామిడి ముక్కలపై ఉప్పు, కారం చల్లుకుని యమ్మీగానూ తింటారు. ప్రత్యేకించి వేసవిలో లభించే ఈ పచ్చి మామిడిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ మామిడి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..!

పచ్చి మామిడిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోఫిలియా, రక్తహీనత వంటి ప్రమాదాలను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధిస్తుంది.

పచ్చి మామిడిలో కెరోటినాయిడ్స్‌ అధికంగా ఉండటం వల్ల కంటిచూపు మెరుగుపడేలా సహాయపడుతుంది.

 వేసవిలో పచ్చి మామిడిని తినడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికాకుడా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.

పచ్చిమామిడి అజీర్తి సమస్యల్ని తగ్గిస్తుంది.

పచ్చిమామిడిలో విటమిన్‌ ఇ, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో దోహదపడతాయి.

➡️