అమెజాన్‌కు ఫ్రాన్స్‌ షాక్‌

Jan 24,2024 21:30 #Business

పారిస్‌ : ఉద్యోగులపై మితిమీరిన నిఘా ఉంచిందనే ఆరోపణలపై అమెజాన్‌కు ఫ్రాన్స్‌ డేటా ప్రొటెక్షన్‌ ఏజెన్సీ భారీ జరిమానా విధించింది. 32 మిలియన్‌ యూరోలు (సుమారు రూ.290 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. యూరోపియన్‌ యూనియన్‌ జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ ప్రకారం ఉద్యోగుల వ్యక్తిగత డేటా సేకరణ, వినియోగంపై అక్కడి రెగ్యూలేటరీల అనుమతి తప్పనిసరి. నిబంధనలకు విరుద్ధంగా అమెజాన్‌ డేటాను సేకరించినట్లు దర్యాప్తులో తేలడంతో జరిమానా విధించింది. ఫ్రాన్స్‌లో అమెజాన్‌కు దాదాపు 20 వేల మంది పని చేస్తున్నారు.

➡️