ఇండోనేషియాతో రూపీ కరెన్సీతో వాణిజ్యం

Mar 7,2024 21:30 #Business

ఇరు దేశాల మధ్య ఒప్పందం

న్యూఢిల్లీ : స్థానిక కరెన్సీతో ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి ఆర్‌బిఐ, ఇండోనేషియా సెంట్రల్‌ బ్యాంక్‌లు ఒప్పందాలు కుదర్చుకున్నాయి. దీంతో ఎగుమతిదారులు, దిగుమతిదారులు తమ దేశీయ కరెన్సీలలో ఇన్‌వాయిస్‌, చెల్లింపులకు ఇది వీలు కల్పించనుంది. అదే విధంగా విదేశీ మారకపు మార్కెట్‌ అభివృద్థికి సహాయపడనుంది. ఇందుకోసం గురువారం ముంబయిలో ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, బ్యాంక్‌ ఇండోనేషియా (బిఐ) గవర్నర్‌ పెర్రీ వార్జియోలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో ద్వైపాక్షికంగా భారత రూపాయి, ఇండోనేషియా రూపియా (ఐడిఆర్‌) వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నామని శక్తికాంత దాస్‌ తెలిపారు.

➡️