ఎఫ్‌టిసిసిఐలో ఎగుమతులు, దిగుమతులపై సర్టిఫికేట్‌ ప్రోగ్రాం

Jan 27,2024 21:25 #Business

హైదరాబాద్‌ : ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఎఫ్‌టిసిసిఐ) ”ఎగుమతి, దిగుమతుల నిర్వహణపై సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌”ను ప్రారంభించినట్లు ప్రకటించింది. మార్కెట్‌ యాక్సెస్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ కెపాసిటీ బిల్డింగ్‌ కింద వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పాన్సర్‌ చేసిన ఈ ఆరు రోజుల ప్రోగ్రామ్‌కు తోలు పరిశ్రమకు చెందిన 67 మంది వ్యాపార యజమానులను అంతర్జాతీయ వాణిజ్యంలో అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానంతో సన్నద్ధం చేయడానికి ఏర్పాటు చేయబడింది. శనివారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎఫ్‌టిసిసిఐ ప్రెసిడెంట్‌ మీలా జయదేవ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో సామర్థ్య పెంపుదల ప్రాముఖ్యతను తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను మెదక్‌, గుంటూరు, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

➡️