ఏషియన్‌ గ్రానిటో ప్రచారకర్తగా రణ్‌బీర్‌

Mar 20,2024 21:25 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ టైల్స్‌, మార్బుల్స్‌ కంపెనీ ఏషియన్‌ గ్రానిటో ఇండియా లిమిటెడ్‌ (ఎజిఎల్‌) తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌ను నియమించుకుంది. రణబీర్‌ ఆకర్షణ, బహుముఖ ప్రజ్ఞ తమ సంస్థ స్ఫూర్తిని సరిగ్గా ప్రతిబింబిస్తాడని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. రణ్‌బీర్‌తో కలిసి త్వరలోనే ప్రచార ప్రకటనలను ఆవిష్కరించనున్నామని ఎజిఎల్‌ ఎండి కమలేష్‌ పటేల్‌ పేర్కొన్నారు.

➡️