ఐటీ షేర్ల అండ.. లాభాల్లో ముగిసిన సూచీలు

Feb 6,2024 21:30 #Business

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. గురువారం ఉదయం ఓ మోస్తరు లాభాలతో ప్రారంభమైన సూచీలకు ఐటీ షేర్లు దన్నుగా నిలిచాయి. దీంతో నిఫ్టీ 21,900 పాయింట్ల ఎగువన ముగిసింది. ఉదయం 71,970.82 (క్రితం ముగింపు 71,731.42) పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే ఒరవడిని కొనసాగించింది. ఇంట్రాడేలో 72,261.40 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 454.67 పాయింట్ల లాభంతో 72,186.09 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 157 పాయింట్ల లాభంతో 21,929.40 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, మారుతీ సుజుకీ, విప్రో, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇండస్‌ ఇండ్‌, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.05గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 77.84 డాలర్లు, బంగారం ఔన్సు 2039 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.ఇతర అప్‌డేట్స్‌..పేటీఎం వాలెట్‌ బిజినెస్‌ను కొనుగోలుపై వస్తున్న వార్తలను జియో ఫైనాన్షియల్‌ ఖండించింది. దీంతో కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం మేర నష్టపోయి రూ.270.20 వద్ద ముగిసింది. గత మూడు రోజులుగా వరుస నష్టాలు ఎదుర్కొన్న పేటీఎం స్వల్పంగా లాభపడింది. 3.26 శాతం లాభపడి రూ.452.80 వద్ద స్థిరపడింది. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ బీఎల్‌ఎస్‌ ఈ-సర్వీసెస్‌ లిమిటెడ్‌ లిస్టింగ్‌లో అదరగొట్టింది. ఇషఉ్య ధర రూ.135 కాగా.. 129 శాతం ప్రీమియంతో రూ.309 వద్ద లిస్టయ్యింది. చివరికి 171 శాతం లాభంతో రూ.366 వద్ద ముగిసింది.

➡️