ఓలా రూ.550 కోట్ల ఐపిఒ..

Dec 23,2023 21:25 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ) కోసం సెబీ వద్ద దరఖాస్తు చేసుకుంది. ఈ ఇష్యూలో రూ.5,500 కోట్ల నిధులు సమీకరించాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 95,191,195 ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఐపిఒ ద్వారా వచ్చిన నిధులను మూల ధన వ్యయాల, ఓలా గిగాఫ్యాక్టరీ ప్రాజెక్ట్‌, అనుబంధ సంస్థ ఒఇటి రుణాల చెల్లింపు, పరిశోధనా, ఉత్పత్తుల అభివృద్థికి, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ వెల్లడించింది.

➡️