కియా కార్లు 3 శాతం ప్రియం

Mar 21,2024 21:15 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా ఇండియా వాహన ధరలను పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి తమ కార్ల ధరలను 3 శాతం వరకు హెచ్చించనున్నట్లు వెల్లడించింది. నిర్వహణ వ్యయాలు, ముడి సరకుల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కియా ఇండియా నేషనల్‌ హెడ్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ హర్దీప్‌సింగ్‌ బ్రాయ్ పేర్కొన్నారు. వినియోగదారులకు ప్రీమియం, సాంకేతికంగా అధునాతన ఉత్పత్తులను అందించడానికి కంపెనీ కృషి చేస్తుందన్నారు. ఈ ఏడాదిలో కార్ల ధరల్ని పెంచడం ఇదే తొలిసారి అన్నారు.

➡️