గుండె సంరక్షణకు లీ హెల్త్‌ లైఫోస్టెరాల్‌

Mar 26,2024 21:10 #Business

హైదరాబాద్‌ : న్యూట్రాసూటికల్స్‌ తయారీలోని లీ హెల్త్‌ డొమెయిన్‌ తాజాగా గుండె సంరక్షణ కోసం సహజసిద్ద ఔషధ మూలికలతో లైఫోస్టెరాల్‌ సాఫ్ట్‌ జెల్‌ క్యాప్సూల్స్‌ను ఆవిష్కరించినట్లు ఆ సంస్థ తెలిపింది. హఅదయ సంబంధ వ్యాధులలో విస్తృత పరిశోధన తర్వాత లైఫోస్టెరాల్‌ను అందుబాటులోకి తెచ్చామని లీ హెల్త్‌ డొమెయిన్‌ డైరెక్టర్‌ ఆళ్ల లీలా రాణి తెలిపారు. ”లైఫోస్టెరాల్‌ సాఫ్ట్‌ జెల్‌ క్యాప్సూల్స్‌ తయారీలో వాడిన బయో యాక్టివ్‌ సమ్మేళనాలు అత్యంత శక్తివంతమైనవి. ఇవి కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ను సమతుల్యం చేయడానికి, క్రమ రహిత హృదయ స్పందనల స్థిరీకరణ కోసం ధమనులలో మఅదువైన ఫలకాన్ని తొలగించడానికి అవసరమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి” అని లీలారాణి తెలిపారు. తమ ఈ ఉత్పత్తులు ఫార్మసీలు సహా అమెజాన్‌, లీ హెల్త్‌ డొమెయిన్‌ పోర్టల్‌లో లభిస్తాయన్నారు.

➡️