గెలాక్సీ ఎ34 5జిపై రూ.3000 తగ్గింపు

Feb 17,2024 21:30 #Business

గూర్‌గావ్‌ : సామ్‌సంగ్‌ తన గెలాక్సీ ఎ34 5జి స్మార్ట్‌ఫోన్‌పై భారీ క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. రూ.3,000 తక్షణ క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వడంతో పాటుగా దీని ధరను రూ.24,499గా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ ఫోన్‌ సిగేచర్‌ గెలాక్సీ డిజైన్‌ మరియు నైటోగ్రఫీ వంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్‌లతో ప్రీమియం అనుభవాన్ని అందిస్తుందని పేర్కొంది. 8జిబి, 128 జిబి వేరియంట్‌ అసలు ధర రూ.27,499గా పేర్కొంది. 48ఎంపి ఒఐఎస్‌ ప్రైమరీ లెన్స్‌, 8ఎంపి అల్ట్రా-వైడ్‌ లెన్స్‌, 5ఎంపి మాక్రో లెన్స్‌తో దీన్ని ఆవిష్కరించింది.

➡️