గెలాక్సీ ఎ55, ఎ 35 5జి ఫోన్ల విడుదల

Mar 20,2024 21:15 #Business

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 18% వాటాసామ్‌సంగ్‌ వెల్లడి

హైదరాబాద్‌ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ కొత్తగా గెలాక్సీ ఎ55 5జి, గెలాక్సీ ఎ35 5జిని ఆవిష్కరించింది. బుధవారం హైదరాబాద్‌లో వీటిని సామ్‌సంగ్‌ ఇండియా ఎంఎక్స్‌ బిజినెస్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ఘాఫ్రాన్‌ ఆలం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సామ్‌సంగ్‌ 18 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉందన్నారు. 5జి మొబైల్‌ విక్రయాల్లో 75 శాతం వృద్థిని కనబర్చుతుందన్నారు. 5జి విభాగంలో 21 శాతం మార్కెట్‌ వాటా ఉందన్నారు. గెలాక్సీ ఎ55 5జి ఫోన్ల ధరల శ్రేణీ రూ.36,999-42,999గా, ఎ35 5జి ధర రూ.27,999-30,999గా నిర్ణయించామన్నారు.

➡️