టాప్‌ 20 కుబేరుల్లోకి మళ్లీ అదాని

Nov 29,2023 21:12 #Business

న్యూఢిల్లీ : ప్రపంచ సంపన్నుల్లో అదాని మళ్లీ 20వ స్థానంలోకి వచ్చారు. అదాని గ్రూపు తీవ్ర ఆర్థిక మోసాలకు పాల్పడుతుందని ఈ ఏడాది జనవరిలో అమెరికన్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన రిపోర్ట్‌కు అదాని సంపద లక్షల కోట్లు ఆవిరై.. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న అదాని 30వ స్థానానికి పడిపోయారు. కాగా ఇటీవల అదాని గ్రూపు కంపెనీల షేర్లు మళ్లీ పెరగడంతో అదాని ఆస్తి క్రమంగా పెరుగుతోంది. బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. గౌతమ్‌ అదానీ 66.7 బిలియన్‌ డాలర్ల సంపదతో 19వ స్థానంలోకి వచ్చారు. టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ వరుస అగ్రస్థానాల్లో నిలిచారు. కాగా గతేడాదితో పోల్చితే అదాని సంపద 53.8 బిలియన్‌ డాలర్లు తక్కువగా ఉంది.

➡️