పలు ఆపిల్‌ ఉత్పత్తులతో రిస్క్‌

Dec 16,2023 21:23 #Business

న్యూఢిల్లీ : కొన్ని ఆపిల్‌ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ అయినా కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా హెచ్చరించింది. ఐఫోన్‌, యాపిల్‌ వాచ్‌, మ్యాక్‌ బుక్‌, ఐపాడ్‌, ఆపిల్‌ టివి ఆపరేటింగ్‌ సిస్టమ్‌లతో పాటు సఫారీ బ్రౌజర్‌లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. దీంతో వినియోగదారుల సమాచారాన్ని హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని తెలిపింది. వినియోగదారులు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఐఒఎస్‌, ఐప్యాడ్‌ ఓఎస్‌ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఒఎస్‌, ఐప్యాడ్‌ ఒఎస్‌ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్‌ ఒఎస్‌ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, ఆపిల్‌ టివి ఒఎస్‌ 17.2, యాపిల్‌ వాచ్‌ ఒఎస్‌ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో లోపాలున్నాయని పేర్కొంది.

➡️