పొరుగు దేశాలతో రూపాయల్లో వాణిజ్యం : మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడి

న్యూఢిల్లీ : భారత్‌తో అనేక దేశాలు రూపాయాల్లో వాణిజ్యం నెరవేర్చడానికి ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, శ్రీలంక సహా పలు గల్ప్‌ దేశాలు ఇందుకు ముందుకు వచ్చాయని.. వాటితో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో లావాదేవీల వ్యయాలను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. సింగపూర్‌ ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించిందన్నారు. దేశీయ కరెన్సీలతో వ్యాపారం వల్ల ఉన్న ప్రయోజనాలు ఇతర దేశాలకు క్రమంగా తెలుస్తోందన్నారు. డాలర్ల కొరత ఉన్న దేశాలకూ ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

➡️