మైక్రోసాఫ్ట్‌ ఎఐ సారథిగా ముస్తాఫా సులేమాన్‌

Mar 20,2024 21:20 #Business

శాన్‌ఫ్రాన్సిస్కో : డీప్‌మైండ్‌ కోఫౌండర్‌ ముస్తాఫా సులేమాన్‌ను మైక్రోసాఫ్ట్‌లో చేరారు. మైక్రోసాఫ్ట్‌ ఎఐ డివిజన్‌ హెడ్‌గా ఆయన్ను నియమించింది. కాపిలాట్‌, బింగ్‌, ఎడ్జ్‌ లాంటి ప్రోడక్ట్స్‌ను అతనే చూసుకోనున్నాడు. ఇన్‌ఫ్లెక్షన్‌ ఏఐ స్టార్టప్‌ సంస్థకు చెందిన కొంత మంది ఉద్యోగుల్ని కూడా మైక్రోసాఫ్ట్‌ నియమించుకోనున్నది. ఇన్‌ఫ్లెక్షన్‌ ఎఐ స్టార్ట్‌ప్‌కు సులేమాన్‌ ప్రస్తుతం హెడ్‌గా ఉన్నారు. డీప్‌ మైండ్‌ అనే ఎఐ సంస్థకు ఆయన కో ఫండింగ్‌ చేస్తున్నారు. బ్రిటన్‌లో ప్రఖ్యాతి గాంచిన ఎఐ సంస్థగా డీప్‌మైండ్‌కు గుర్తింపు ఉంది. దీన్ని 2014లో గూగుల్‌ సంస్థ కొనేసింది.

➡️