వచ్చే వారంలో ఐపిఒకు 11 సంస్థలు

Dec 16,2023 21:10 #Business

ముంబయి : స్టాక్‌ మార్కెట్ల ద్వారా నిధులు సమీకరించడానికి కంపెనీలు వరుస కడుతున్నాయి. వచ్చే వారం ఏకంగా 11 కంపెనీలు ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ)కు రానున్నాయి. వీటిలో ముత్తూట్‌ మైక్రోఫిన్‌, మోతీసన్స్‌ జువెలర్స్‌, హ్యాపీ ఫోర్జింగ్స్‌, సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌, ముఫ్తీ జీన్స్‌, అజాద్‌ ఇంజినీరింగ్‌ తదితర సంస్థలున్నాయి. ఆయా సంస్థలు తొలిసారి స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ కానున్నాయి. ఎస్‌ఎంఇ సెగ్మెంట్‌లోనూ నాలుగు కంపెనీలు ఇష్యూకు రానున్నాయి. ముత్తూట్‌ పప్పాచాన్‌ గ్రూప్‌నకు చెందిన ముత్తూట్‌ మైక్రోఫిన్‌ రూ.960 కోట్ల నిధుల కోసం డిసెంబర్‌ 18న ఐపిఒకు వస్తోంది. ఐపిఒలో విక్రయిస్తున్న షేర్లను క్యూఐబిలకు 55 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం చొప్పున కేటాయించారు. ఆటోమొబైల్‌ రంగంలో విడిభాగాల తయారు చేసే హ్యాపీ ఫోర్జింగ్స్‌ లిమిటెడ్‌ ఇష్యూ డిసెంబర్‌ 19న ప్రారంభం కానుంది. ముఫ్తీ జీన్స్‌ తయారీ సంస్థ క్రెడో బ్రాండ్స్‌ మార్కెటింగ్‌ లిమిటెడ్‌ డిసెంబర్‌ 19న ఐపిఒకు వస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌ విడిభాగాల తయారీ సంస్థ అజాద్‌ ఇంజినీరింగ్‌ ఇష్యూ డిసెంబర్‌ 20న ప్రారంభమై 22 ముగియనుంది. ఈ ఐపిఒ ద్వారా రూ.740 కోట్లు సమీకరించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ముంబయికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ డిసెంబర్‌ 18న ఇష్యూకు వస్తోంది.

➡️