హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు రెండు అవార్డులు

Nov 23,2023 21:23 #Business

ముంబయి : ప్రొఫెషనల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (పిడబ్ల్యుఎం) నిర్వహించిన గ్లోబల్‌ ప్రయివేటు బ్యాంకింగ్‌ అవార్డ్స్‌ 2023లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు రెండు అవార్డులు దక్కినట్లు ఆ సంస్థ వెల్లడించింది. గతేడాది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ వృద్థి వ్యూహం తమను ఆకట్టుకున్నదని, దీని వల్ల తమ క్లయింట్‌ బేస్‌ గణనీయంగా పెరగడంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న హబ్‌, స్పోక్‌ లకేషన్‌లు వినూత్నమైన ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ ఇనిషియేటివ్‌లతో పాటు గణనీయంగా విస్తరించాయని న్యాయనిర్ణేతలు పేర్కొన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అహ్మదాబాద్‌, బెంగుళూరు వంటి విద్యా సంస్థల భాగస్వామ్యంతో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌ల కోసం వివిధ విద్య, శిక్షణ కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని న్యాయ నిర్ణేతలు బ్యాంక్‌కు పురస్కరాన్ని ప్రకటించినట్లు పిడబ్ల్యుఎం తెలిపింది.

➡️