హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో పెరగనున్న ఎల్‌ఐసి వాటా

Jan 27,2024 21:30 #Business

ముంబయి : ప్రయివేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో దిగ్గజ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) తన వాటాను పెంచుకోవడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించింది. 2025 జనవరి 24 నాటికి హెచ్‌డిఎఫ్‌సిలో ఎల్‌ఐసి తన వాటాను 9.99 శాతానికి పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. 2023 డిసెంబర్‌ ముగింపు నాటికి 5.19 శాతం వాటాను కలిగి ఉంది. మరో 4.8 శాతం వాటాలను పెంచుకోవడానికి వీలు కల్పించినట్లయ్యింది.

➡️