హోగర్‌ కంట్రోల్స్‌ ట్రేడ్‌మార్క్‌పై విష్ణు రెడ్డికి రిలీఫ్‌

Mar 9,2024 21:23 #Business

హైదరాబాద్‌ : స్మార్ట్‌ హోమ్‌ సొల్యూషన్స్‌లకు చెందిన ఐఒటి కంపెనీ హోగర్‌ కంట్రోల్స్‌ ట్రేడ్‌మార్క్‌ విషయంలో తమకు ఉపశమనం లభించిందని ఆ సంస్థ సిఇఒ విష్ణు రెడ్డి తెలిపారు. హోగర్‌ కంట్రోల్స్‌ మాజీ డైరెక్టర్లు విజరు కుమార్‌ అనదాసు (యశ్‌), కరుణ్‌ కుమార్‌ అనదాసు (కరణ్‌ కుమార్‌), ఇతరులపై ట్రేడ్‌మార్క్‌ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇంజెక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చిందని పేర్కొన్నారు. సినిమాటోగ్రఫిక్‌ ఫిల్మ్స్‌ కాపీరైట్‌పై చొరబాటు ఉండేలా డిజిటల్‌, ప్రింట్‌తో సహా ఏ రూపం మాధ్యమం ప్రకటనలలోనైనా వ్యాపార చిహ్నాలు, అనుబంధిత మెటీరియల్‌లను ఉపయోగించడం నుంచి మాజీ డైరెక్టర్లు, సంబంధిత మూడో పక్షాలను నిషేధించిందన్నారు.

➡️