షేర్‌చాట్‌లో 15% ఉద్యోగులపై వేటు

Dec 20,2023 21:25 #Business

న్యూఢిల్లీ: మోహల్లా టెక్‌కు చెందిన సోషల్‌ మీడియా వేదిక షేర్‌చాట్‌, షాట్‌ వీడియో ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్‌ మోజ్‌లో 15 శాతం ఉద్యోగులపై వేటు పడనుంది. తాజా తొలగింపుల్లో భాగంగా దాదాపుగా 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలోనూ 500 మందికి ఉద్వాసన పలికింది. వచ్చే ఏడాది, ఏడాదిన్నర కాలంలో కంపెనీ లాభాల్లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఇందుకోసం 2024లో సంస్థ పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళికలు వేస్తుందన్నారు. ఇందులో భాగంగానే 15 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకునే యోచనలో ఉన్నామన్నారు.

➡️