జొమాటోకు రూ.184 కోట్ల పన్ను నోటీసులు

Apr 2,2024 21:10 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ పుడ్‌ డెలివరీ వేదిక జొమాటోకు రూ.184 కోట్ల పన్ను నోటీసులు జారీ ఆయ్యాయి. సర్వీస్‌ ట్యాక్స్‌, జరిమానా కలిపి చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నుంచి తమకు ట్యాక్స్‌ డిమాండ్‌ నోటీసు అందిందని జొమాటో రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. విదేశీ అనుబంధ సంస్థలు, దేశం వెలుపల ఉన్న శాఖల్లో 2014 అక్టోబర్‌ నుంచి 2017 జూన్‌ మధ్య జరిగిన విక్రయాలపై సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించలేదని ఢిల్లీ సెంట్రల్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ ఏప్రిల్‌ 1న డిమాండ్‌ నోటీసు పంపించినట్లు జొమాటో తెలిపింది. కాగా.. దీనిపై అప్పీల్‌కు వెళతామని జమాటో పేర్కొంది. ఇంతక్రితం పంపించిన షోకాజ్‌ నోటీసుపై తాము ఆధారాలతో సహా వివరణ ఇచ్చామని.. తాజా నోటీసులు ఇచ్చే ముందు సంబంధిత అధికారులు దీన్ని పరిగణనలోకి తీసుకోలేదని జమాటో పేర్కొంది.

➡️